రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు దూరం?

Revant Reddy away from Parliament elections?

Revant Reddy away from Parliament elections?

Date:01/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారా?  2019 లోక్సభ ఎన్నికలకు పోటీ చేయడమే కాదు, అసలు ప్రచారానికే దూరంగా ఉండనున్నారా? టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతారా.ఇవన్నీ ఇపుడు నిశ్శబ్ద ప్రశ్నలు. వీటికి సమాధానాలు మెల్లగా అర్థమవుతున్నాయి. రేవంత్ ప్రణాళికలు అన్నీ రివర్స్ కావడంతో రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయాణాన్ని విశ్లేషణ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా ప్రశాంతత కోసం టూర్లో ఉన్న ఆయన అక్కడి నుంచి వచ్చాక కూడా మీడియాకు, రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు సంవత్సరాల పాటు కేవలం పర్సనల్ పనులు మాత్రమే పట్టించుకోవాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
తాను ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని ఇచ్చిన మాట నిజమే అయినా ఈ నిర్ణయానికి అది కారణం కాదని తెలుస్తోంది. ముఖ్యంగా తన పొరపాటా? గ్రహపాటా తెలుసుకుని, తనను తాను సమీక్షించుకోవడానికి ఆయన ఈ సమయం తీసుకున్నట్టు అనిపిస్తోంది. అందుకే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి కీలక పదవిలో ఉన్నా కూడా కాంగ్రెస్ కీలక సమావేశాలు దేనికీ ఎన్నికల అనంతరం హాజరుకాలేదు. త్వరలో 2019 లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. అపుడు కూడా రేవంత్ రెడ్డి ఆ ఎన్నికలకు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. కొందరు లోక్సభకు పోటీచేస్తారని చెబుతున్నా… ప్రస్తుత పరిణామాలు బట్టి చూస్తే అసలు ప్రచారానికి కూడా రాడనే అంటున్నారు. మొత్తానికి 2018 తెలంగాణ ఎన్నికలు అనేక సంచలనాలకు నెలవయ్యాయి.
Tags:Revant Reddy away from Parliament elections?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *