భూపాలపల్లిలో రేవంత్ పాదయాత్ర ప్రారంభం
వరంగల్ ముచ్చట్లు:
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రారంభమయింది. మంగళవారం రాత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లిలో బస చేశారు. బుధవారం ఉదయం రేగొండ మండలం కొటవటంచ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి చల్లగరిగే, జూకల్లు గ్రామాల్లో ప్రజలతో మాటాముచ్చటలో పాల్గొంటారు. ఆ తర్వాత చిట్యాలకు చేరుకొని మధ్యాహ్న భోజనం చేస్తారు. చిట్యాల నుంచి ఏలేటిరామయ్యపల్లి, నవాబుపేట మీదుగా మొగుళ్లపల్లి వరకు 8కిలో మీటర్లు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో జరిగే కార్నర్ మీటింగులో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ వేడిని పుట్టిస్తున్న రేవంత్ రెడ్డి మొగుళ్లపల్లి సభలో ఏం మాట్లాడుతారో? అనే ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.
Tags: Revanth Padayatra begins at Bhupalapally

