మంచిప్ప రిజర్వాయర్ ను పరిశీలించిన రేవంత్ రెడ్డి
కామారెడ్డి ముచ్చట్లు:
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మంచిప్ప రిజర్వాయర్ ప్యాకేజ్ 21,22 పనులు టపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం నాడు పరిశీలించారు. రీడిజైన్ తో పది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు. 1.5 టీఎంసీ నుంచి 3.5 టీఎంసీకి పెంచడాన్ని బాధిత గ్రామాలు వ్యతిరేకిస్తున్నాయిని అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా పనులు ప్రారంభించారని అన్నారు. అడ్డుకున్న వారిపై హత్యాయత్నం కేసులు పెట్టి రిమాండ్ కు తరలించారని ఆవేదన వ్యక్తం చేసారు. రీడిజైన్ ప్లాన్ రద్దు చేసి పాత ప్లాన్ ప్రకారమే పనులు చేయాలని డిమాండ్ చేసారు.

Tags;Revanth Reddy inspected Manchippa Reservoir
