టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌  ముచ్చట్లు:

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. భారీ ర్యాలీతో గాంధీ భవన్‌కు చేరుకున్న ఆయన టీపీసీసీ చీఫ్‌గా పదవి చేపట్టారు. ఇక నేడు రేవంత్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో… జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో గాంధీ భవన్‌ వద్ద సందడి నెలకొంది. కాగా అంతకుముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇక మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి నియామకంపై ఆది నుంచి అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, వి. హనుమంతారావు విడిగా గాంధీ భవన్‌కు చేరుకున్నారు. కాగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం జరుగుతున్న సమయంలో, కొంతమంది కార్యకర్తలు సమావేశ ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. బారీకేడ్స్ ధ్వంసం చేసి, కుర్చీలను చిందరవందరగా పడేశారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Revanth Reddy took over as TPCC Chief

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *