నా ఒత్తిడితోనే రేవంత్ గెలిచాడు

విశాఖపట్నం ముచ్చట్లు:

 


రేవంత్ రెడ్డి గెలుపుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు మార్చకుండా తాను చీఫ్ ఎలక్షన్ కమిషన్ పై ఒత్తిడి తేవడం వల్లే రేవంత్ రెడ్డి గెలిచాడని పేర్కొన్నారు. అంజనీ కుమార్ ఈవీఎంలు మార్చుకుండా స్ట్రిక్ట్ గా వ్యవహరించాడని, అందుకే ఆయ నను సస్పెండ్ చేశారని ఆరోపించారు. మాజీ డీజీపీ అంజనీ కుమార్ లాంటి వ్యక్తుల్ని కాపాడుకోవా ల్సిన అవసరం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు.అంజనీ కుమార్ ని రేవంత్ చీఫ్ అడ్వైజర్ గా నియమిం చుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ గెలుస్తుందని గతంలో తాను చెప్పానని వెల్లడిం చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని అనుకున్నారని,తెలంగాణలో జనసేనాకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు.పవన్ కళ్యాణ్ కు విశాఖలో ఏమి పని అని ప్రశ్నించారు.దొంగల్ని, ప్యాకేజి స్టార్ లను నమ్మొద్దని పిలుపునిచ్చారు. మన ప్రాంతం వచ్చి, మన భూములను దోచుకుంటున్నారని, తాను లేకపోతే స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని అమ్మేసేవారని పేర్కొన్నారు.

Tags: Revanth won because of my pressure

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *