రేవంత్ లవ్ స్టోరీ…

 

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

 

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణమయ్యారు రేవంత్ రెడ్డి. ఒక దశలో తెలంగాణలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుందనుకుంటున్న సమయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయ్యాక పార్టీని గాడిలో పెట్టారు. ఎన్నో అవమానాలు.. అడ్డంకులు.. ఎదుర్కొంటూ కాంగ్రెస్ విజయానికి తీవ్రంగా కృషి చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ప్రజలు అక్కున చేర్చుకున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో.. ఒక దశలో కేసీఆర్ ను ప్రజలు ఎప్పటికీ ఆదరిస్తారని అనుకున్నారు. కానీ ఈ తరుణంలో రేవంత్ రెడ్డి తనదైన రాజకీయ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి లోకి తీసుకురావడమే కాకుండా ఆయన ప్రజల మనసును దోచుకున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గురించి ఆయన పర్సనల్ జీవితం గురించి చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఆయన లవ్ స్టోరీ పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు.ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో ఏబీవీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఈ సమయంలో గీతారెడ్డి అనే అమ్మాయి పై రేవంత్ రెడ్డి మనసు ఆకర్షించింది. ఈ క్రమంలో ఆమెకు రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేశాడు. అయితే ఏబీవీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం చూసి ఆయనను గీతారెడ్డి సైతం ఇష్టపడింది. కానీ వీరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. పైగా రేవంత్ రెడ్డి పై రాజకీయ ఒత్తిడి తీవ్రంగా పడింది.ఎందుకంటే?గీతారెడ్డి ఎవరో కాదు. కాంగ్రెస్ దివంగత నాయకుడు జైపాల్ రెడ్డి సోదరుని కూతురు. రేవంత్ రెడ్డి, గీతారెడ్డి లా ప్రేమ విషయం తెలిశాక గీతారెడ్డి వాళ్ళ నాన్న ఈ విషయాన్ని జైపాల్ రెడ్డితో చెప్పారు. దీంతో జైపాల్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డికి పిలుపు వచ్చింది. అయితే ఏమాత్రం బెదరకుండా రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డి కి తమ ప్రేమ గురించి వివరించారు. రేవంత్ రెడ్డి ధైర్యాన్ని చూసి జైపాల్ రెడ్డి సైతం ఫిదా అయ్యారు. పైగా ఇద్దరిదీ సేమ్ క్యాస్ట్ కావడంతో వీరి పెళ్లికి ఒకే చెప్పారు.అలా రేవంత్ రెడ్డి రాజకీయాల్లోనే కాకుండా లవ్ స్టోరీ లోను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని విజయం సాధించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతుండటంతో ఆయన లవ్ స్టోరీ పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు

Tags: Revanth’s love story…

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *