ప్రేమ…పగ

Date:31/08/2019

చెన్నై ముచ్చట్లు:

అమ్మాయితో ప్రేమ వ్యవహారంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి ప్రాణం తీసింది. తన ప్రియురాలిని ప్రేమిస్తున్న మరో యువకుడిని మణిభారతి అనే యువకుడు స్నేహితుల సాయంతో మట్టుబెట్టాడు. శవాన్ని పూడుస్తున్న సమయంలో కొందరు గమనించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌కు చెందిన మణిభారతి అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని గత మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు.

 

 

 

 

ఎగువనల్లాటూరు గ్రామానికి మహేశ్‌కుమార్(20) సైతం ప్రేమ పేరుతో ఆ యువతి వెంట పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మణిభారతి తన ప్రియురాలి వెంట పడొద్దని అనేకసార్ల మహేశ్‌ను హెచ్చరించాడు. అయినా పట్టించుకోని అతడు యువతి వెంట పడుతూనే ఉన్నాడు. దీంతో విసిగిపోయిన మణిభారతి  తన స్నేహితులు అజిత్‌(18), శివలింగం(19) కార్తీక్‌(19) విఘ్నేష్‌(20) దినేష్‌(18)తో కలిసి మహేశ్‌పై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన మహేశ్ ప్రాణాలు కోల్పోవడంతో అతడిని సమీపంలోని చెరువుగట్టుపై పూడ్చేందుకు ప్రయత్నించారు.

 

 

 

 

అదే సమయంలో అటువైపు వచ్చిన గొర్రెల కాపర్లు ఈ విషయాన్ని గమనించడంతో సగం పూడ్చిన మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. గొర్రెల కాపర్లు ఇచ్చిన సమాచారంతో తిరువళ్లూరు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్యకు గురైన మహేష్‌ కుమార్‌ సెల్‌ఫోన్‌ ఆధారంగా డేటా ఆధారంగా మణిభారతిని అదుపులోకి తీసుకుని విచారించగా స్నేహితుల సాయంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. పరారీలో ఉన్న అతడి స్నేహితుల కోసం గాలిస్తుండగానే వారంతా శుక్రవారం ఎగ్మోర్‌ కోర్టులో లొంగిపోయారు.

భార్యను చంపేసి… ఫోన్

Tags: revenge of love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *