వేలంలో రూ.4.59 లక్షలు ఆదాయం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని పోలీస్‌స్టేషన్, ఎస్‌ఈబి పోలీస్‌స్టేషన్‌లో వాహనాల వేలంలో రూ.4.59 లక్షలు ఆదాయం లభించింది. గురువారం ఎస్‌ఈబి ఏఈఎస్ శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో వేలంపాటలు నిర్వహించారు. ఎస్‌ఈబి స్టేషన్‌లో 11 వాహనాలు వేలం వేయగా 8 వాహనాలు కొనుగోలు చేశారు. వీటి ద్వారా రూ.1.60 లక్షలు ఆదాయం లభించిందని సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. అలాగే పుంగనూరు పోలీస్‌స్టేషన్‌లో 12 వాహనాలను వేలం వేయగా రూ.2.99 లక్షలు ఆదాయం లభించినట్లు ఎస్‌ఐ మోహన్‌కుమార్ తెలిపారు. వేలం నిధులు ప్రభుత్వానికి జమ చేసినట్లు తెలిపారు.

Tags; Revenue of Rs.4.59 lakhs in the auction
