సిరిసిల్లపై రేవంత్ గురి

Reverent aims on cyrils

Reverent aims on cyrils

Date:23/11/2018
కరీంనగర్ ముచ్చట్లు:
తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా అయిపోవడంతో పార్టీలన్నీ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపు, అసంతృప్తుల బుజ్జగింపులతో బిజీ బిజీగా గడిపిన పార్టీలు.. ఇక ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నాయి. అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచే అంతా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. రాష్ట్రంలోని అన్ని పార్టీలకంటే కొంచెం ముందుందనే చెప్పాలి. మిగిలిన పార్టీలన్నింటితో పోలిస్తే మహాకూటమి కొంత వెనకుంది. పొత్తులు ఎప్పుడో ఖరారైనా సీట్ల సర్ధుబాటు మాత్రం ఆలస్యమవడంతో ఆయా పార్టీలలోని అభ్యర్థులకు ప్రచారం చేసుకునేందుకు తక్కువ సమయమే దొరికింది. దీనినే ఉపయోగించుకుని ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను కాదని, రాహుల్ గాంధీ కొన్ని పనులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి అప్పజెప్పారు. అసలే దూకుడు స్వభావమున్న రేవంత్.. అధిష్ఠానం ఇచ్చిన బాధ్యతలను చక్కగా వాడుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇదే సందర్భంలో ఓ స్థానాన్ని టార్గెట్‌ చేశాడు.తెలంగాణ ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకున్న రేవంత్‌ను టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసిందనేది బహిరంగ రహస్యమే.
అందుకే ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన రేవంత్‌ను ఓడించడానికి టీఆర్ఎస్ చాలా ప్లాన్లు చేసింది. అక్కడ బలమైన అభ్యర్థిని దించడంతో పాటు, మంత్రి హరీశ్‌కు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. మరో మంత్రి కేటీఆర్ సైతం ఈ స్థానంపై కన్నేసి ఉంచగా, స్వయంగా కేసీఆరే ఇక్కడి పరిస్థితులపై దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రేవంత్.. తన నియోజకవర్గ ప్రజలను కలిసి అన్ని చక్కదిద్దుకున్నాడు. అంతేకాదు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను టార్గెట్ చేశాడు. అక్కడ ఎలాగైనా కేటీఆర్‌ను ఓడించాలనే తలంపుతో వ్యూహాలు సిద్ధం చేస్తున్నాడు. సిరిసిల్లలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా న్యాయవాది కేకే మహేందర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2009లో కేకే మహేందర్‌ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేటీఆర్‌పై టీఆర్‌ఎస్‌ రెబల్‌గా పోటీచేసి 171 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. 2010లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ కేటీఆర్‌పై ఓడిపోయారు. 2014లో ఆయనకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కలేదు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా మళ్లీ కేటీఆర్‌తో తలపడుతున్నారు. దీంతో రేవంత్ ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఇందుకోసం బహిరంగ సభతో పాటు ప్రచారం నిర్వహించబోతున్నారు.
Tags:Reverent aims on cyrils

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *