నీరుగారుతున్న లక్ష్యం

Reversing goal

Reversing goal

Date:09/10/2018
గుంటూరు ముచ్చట్లు:
భూగోళానికి పట్టిన సమస్యల్లో ప్లాస్టిక్  భూతం ఒకటి. ప్లాస్టిక్ వ్యర్ధాలను వదిలించుకోవడం అంత ఈజీ కాదు. అందుకే బాధ్యతాయుతంగా ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలి. ప్రధానంగా చిన్న చిన్న అవసరాలకు ప్లాస్టిక్ సంచులు వాడడం మానేయాలి. ఎందుకంటే ప్రమాణాలకు అనుగుణంగాలేని సంచుల వల్ల పర్యవరణానికి హాని జరుగుతుంది. ఈ తరహా ప్లాస్టిక్ సంచులు మట్టిలో త్వరగా కలసిపోవు. కొన్ని వందల ఏళ్లు పడుతుంది. ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణహితమైన సంచులనే వాడాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఇటీవలిగా పలు ప్రాంతాల్లో అధికారికంగా అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. కార్పోరేషన్ స్థాయిలో అయితే అధికారులు చొరవచూపి చైతన్యం తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.
దుకాణాదారులు, వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరులోని పలు ప్రాంతాల్లోనూ ఈ తరహా కార్యక్రమం బాగానే సాగింది. అయితే లక్ష్యం మాత్రం నెరవేరడంలేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. షాపులవారితో పాటూ వినియోగదారులు యథేచ్ఛగా ప్లాస్టిక్ క్యారీబ్యాగ్‌లు వాడుతున్నారని.. వాటి వేస్టేజ్‌లో పెద్దగా మార్పు లేదని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న పాలిథిన్‌ కవర్లను వినియోగించకూడదు. వీటిని బ్యాన్ చేశారు. అయితే గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ తరహా సంచుల వాడకం కొనసాగిపోతోంది. వీటి వినియోగంపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు ఉదాసీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనలను ఉల్లంఘించి ప్లాస్టిక్‌ క్యారీబ్యాగులు అమ్మిన వారిపై, కొనుగోలు చేసిన వారిపై ప్లాస్టిక్‌ వేస్ట్‌ మ్యానేజ్‌మెంట్‌ నిబంధనలు అమలు చేయడంలో అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్యకు ముగింపు రావడం లేదని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్లాస్టిక్ సంచులను యథేచ్ఛగా వినియోగించడం ద్వారా స్థానికంగా పర్యావరణం ప్రమాదంలో పడుతోందని అంటున్నారు. కాలుష్యం ప్రబలిపోతోందని చెప్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు పర్యావరణానికి తీవ్ర హాని చేస్తాయి. ఈ విషయం తెలిసీ ప్లాస్టిక్‌ను నియంత్రించడంలో అధికారులే కాదు.. ప్రజలూ.. విఫలమవుతున్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం మరింతగా ఉండాలి. ప్లాస్టిక్‌ బ్యాగులను నియంత్రించి జ్యూట్‌ సంచులు, ఇతరత్రా పర్యావరణహిత మెటీరియల్‌తో తయారైన సంచులనే వాడాలి. ప్రకృతిని, పర్యవరణాన్ని పరిరక్షించుకోవాలి.
Tags:Reversing goal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed