ఎప్పిఎఫ్ పై సమీక్షా సమావేశం- మంత్రి వనిత
అమరావతి ముచ్చట్లు:
ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పై హోంమంత్రి తానేటి వనిత బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయం 2వ బ్లాక్ లో ఎస్పిఎఫ్ ఉన్నతాధికారులతో ఆమె సమావేశమైయారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఎస్పిఎఫ్ తీసుకుంటున్న చర్యలు, దేవాలయాల్లో భద్రత, సీసీ కెమెరాల నిఘా వంటి అంశాలపై చర్చించారు. ఎస్పిఎఫ్ సిబ్బందికి సంబంధించిన సమస్యలు, సవాళ్ళను, ప్రొమోషన్స్, ఇతర అంశాలపై చర్చించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్, ఎస్పిఎఫ్ డీజీ సంతోష్ మెహ్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో ఎస్పిఎఫ్ పోలీసుల పని తీరు గురించి మంత్రికి అధికారులు వివరించారు.

Tags: Review meeting on PPF- Minister Vanitha
