ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి పై అధికారులతో సమీక్ష సమావేశం

Date:21/11/2020

నెల్లూరు  ముచ్చట్లు:

నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధిపై అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ, టెంపరరీ ఉద్యోగులు మరియు శానిటేషన్ సిబ్బంది జీతాలు మరియు వారి విధుల గురించి అధికారులతో చర్చించారు. కోవిడ్ కారణంగా నిలచిపోయి, తిరిగి నవంబర్ 3 నుండి మొదలైన సదరన్ క్యాంపుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకొనివస్తే, ఆ సమస్యల పరిష్కారానికి శక్తిమేర కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.కోవిడ్ కారణంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న ఆర్థోపెడిక్ డాక్టర్ ముఖర్జీ  మృతి కి సంతాపం తెలియజేశారు. ఈ సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ సాంబశివరావు, ఆర్ ఎం ఓ డాక్టర్ మస్తాన్ భాష, డాక్టర్ నిర్మలా దేవి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీ సునంద, ఆస్పత్రిలోని పలు విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నందింగం.. ఉండవల్లి మధ్యలో డొక్కా

Tags: Review meeting with officials on government hospital development

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *