Review of CEOs of Co-operative Societies

సహకార సంఘాలు సీఈఓ ల సమీక్ష

Date:24/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు సబ్ డివిజినల్ కో ఆపరేటివ్ ఆఫీసు నందు పుంగనూరు సబ్ డివిజనల్ కు చెందిన సహకార సంఘాలు సీఈఓ ల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో సబ్ డివిజనల్ Sdlco Arifulla మాట్లాడుతూ సహకార సంఘాల నందు 300 రూపాయలు కన్న తక్కువ షేరు ధనము ఉన్న వాళ్లు భూమి పట్టాదారు పాసు బుక్కు జిరాక్స్. 10 (1). ఆధార్ కార్డు.2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని వ్యత్యాస షేరు ధనాన్ని సంఘాల నందు కట్టుకోవాలని సూచించారు. అలాగే సంఘము నందు బకాయి పడి ఉన్న రుణాలపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని తెలిపారు. సంఘ అభివృద్ధి కొరకు బిజినెస్ డెవలప్మెంట్ ప్లానింగ్ ను ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని తెలిపారు . అలాగే 31-1-2020 న చిత్తూరు డి సి సి బ్యాంక్ నందు జరిగే ట్రైనింగ్ నందు త్రిషబ్యా కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలనీ తెలిపారు కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్ రెడ్డప్ప జూనియర్ ఇన్స్పెక్టర్ అమర్నాథ్ రెడ్డి మరియు పెద్దపంజాణి సీఈవో ఎన్. రామరాజు చౌడేపల్లి సీఈవో ఎమ్.ముని రాజా సోమల సీఈవో రఘుపతి సూపర్వైజర్ నాగప్రసాద్ మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణలో పుంగనూరుకు రాష్ట్ర స్థాయి అవార్డు

Tags: Review of CEOs of Co-operative Societies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *