సోమలలో గృహ నిర్మాణాల ప్రారంభోత్సవాల పనుల పై సమీక్ష

సోమల ముచ్చట్లు :

 

గృహ నిర్మాణాల ప్రారంభోత్సవాల పనులు ప్రారంభం ను విజయవంతం చేయాలని నిర్మాణ శాఖ నర్సింహచ్చారి అన్నారు. సోమవారం సోమల ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి సర్పంచులు ఎంపీటీసీలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఈ మాట్లాడుతూ జూలై 1వ తేదీన జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని కోరారు. సర్పంచులు ఎంపీటీసీలు పరస్పరం సమన్వయంతో పండుగ వాతావరణంలో నిర్మాణాల పనులు ప్రారంభోత్సవం నిర్వహించాలని సూచించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం వేయాలని ప్రత్యేకాధికారి ఎహసాన్ బాషా అన్నారు. అనంతరం మండలంలో ఎంపిక చేసిన వైఎస్ఆర్ కాలనీ ల పై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్యాంప్రసాద్రెడ్డి, ఎంపీడీవో నాగరాజ ఎంపీపీ ఈశ్వరయ్య, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు అమాస మోహన్ నాగేశ్వరరావు, సర్పంచ్ లు  పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Review of housing construction works in Somala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *