‘ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్’ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష

Review of 'International Sweet Festival' maintenance arrangements

Review of 'International Sweet Festival' maintenance arrangements

Date:31/12/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనవరి13 నుండి 15 వరకు సికింద్రాబాద్  పరేడ్ గ్రౌండ్స్ లో  ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు అనుబంధంగా జరిగే   ‘ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ ‘ నిర్వహణ ఏర్పాట్లపై పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాల, దేశాలకు చెందిన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వెంకటేశం మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ లో 1000 రకాల స్వీట్స్ ను  ప్రదర్శించామన్నారు, ఈ ఫెస్టివల్ లో వివిధ రాష్ట్రాల తో పాటు 15 దేశాల నుండి ప్రతినిధులు వారి సాంప్రదాయ స్వీట్స్ తో స్వీట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ స్వీట్ ఫెస్టివల్ లో సుమారు 8 లక్షల మంది సందర్శకులు పాల్గొన్నారన్నారు. వెయ్యి రకాల స్వీట్స్, వివిధ రకాల పతంగులను  ఒకే వేదికపై చూడటానికి సందర్శకులు రావడం ఆనందం వ్యక్తం చేశారు బుర్రా వెంకటేశం.  ఈ సంవత్సరం నిర్వహించే స్వీట్ ఫెస్టివల్  కు సుమారు 20 దేశాల ప్రతినిధులు స్వీట్ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. 10 లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వెంకటేశం సమావేశంలో పాల్గొన్న సంఘాల ప్రతినిధులకు సూచించారు.
Tags:Review of ‘International Sweet Festival’ maintenance arrangements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed