ఉపాధి హామీ పథకంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

Date:03/12/2019

అమరావతి ముచ్చట్లు:

ఉపాధి హామీ నిధులతో రాష్ట్రంలో గ్రామసచివాలయాల నిర్మాణం. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 4892 గ్రామ సచివాలయాల నిర్మాణం.  ఇప్పటికే 2781 గ్రామ సచివాలయాలకు పరిపాలనా అనుమతులు. గ్రామసచివాలయాల డిజైన్ల  పరిశీలన. తక్కువ రేటుకే సిమెంట్ ను అందించేలా సిమెంట్ కంపెనీలతో కలెక్టర్లు చర్చలు జరపాలి. సిమెంట్ బస్తా 240  రూపాయలకే వచ్చేలా చూడాలి. ఉపాధి హామీ కింద చేపట్టే పనులు సకాలంలో పూర్తి అయ్యేందుకు వెంటనే కలెక్టర్లు, పంచాయతీరాజ్‌, ఆర్ డబ్ల్యుఎస్, గిరిజన సంక్షేమం, సర్వశిక్షాభియాన్ అధికారులతో రేపు వీడియో కాన్ఫరెన్స్.
పంచాయతీరాజ్ ఇఎన్ సి ల ద్వారా పిఇ ఆర్ టి చార్ట్ లను సిద్దం చేయాలి. చేపట్టిన పనులు, పురోగతి, బాధ్యుతలైన అధికారులు ఎవరో నివేదికను సిద్దం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల పక్కాగృహాల నిర్మాణానికి అనుబంధంగా ఉపాధి హామీ పనులు. ఇళ్ల నిర్మాణం కోసం స్థలాల లెవలింగ్, గ్రావెల్ రోడ్ల నిర్మాణం. గ్రామీణ పారిశుధ్యంకు పెద్దపీట. గ్రామాల్లో అవసరమైన చోట్ల సిసి డ్రైన్ల నిర్మాణం. ఈ నిర్మాణాలను 30శాతం స్వచ్చాంధ్రప్రదేశ్ కార్పోరేషన్, మిగిలిన 70 శాతం ఉపాధి నిధులు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1418 పనులకు అంచనాలు సిద్దం. వీటిల్లో ఇప్పటికే 145 అంచనాలకు పరిపాలనా అనుమతి. అంతర్గత రహదారులు లేని గ్రామాల్లో 90 శాతం ఉపాధి హామీ నిధులతో సిసి రోడ్లు. మనబడి నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన.

 

 

 

 

 

 

 

 

ఉపాధి హామీ నిధులతో ప్రహరీగోడల నిర్మాణంకు రూ.601 కోట్లు. కొత్తగా అనుమతి పొందిన స్కూల్ బిల్డింగ్ ప్రహరీలకు నరేగా నుంచి నిధులు కేటాయించాలి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి ప్రహరీల నిర్మాణం పూర్తి చేయాలి. ప్రతి నియోజకవర్గంకు నరేగా కింద రూ.15 కోట్లు కేటాయింపు. మార్చి పదో తేదీ నాటికి మెటీరియల్ మెటీరియల్ నిధులను సద్వినియోగం చేసుకోవాలి.  రాష్ట్ర వ్యాప్తంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.3335 కోట్ల ఉపాధి హామీ మెటీరియల్ నిధులు ఇప్పటి వరకు ఖర్చు చేసినవి రూ.896 కోట్లు ఇంకా వినియోగించాల్సిన నిధులు రూ.2457  కోట్లు. ఈ ఏడాది జూన్‌ నుంచి పెండింగ్  బకాయిలను విడుదల చేయాలన్న పిఆర్ ఇఎన్‌సి అభ్యర్థనపై పరిశీలన. రాష్ట్ర వ్యాప్తంగా ఓవర్ హెడ్ ట్యాంక్ లకు రంగులు వేయాలని ఆదేశం. సిపిడబ్ల్యు స్కీంల కింద పనిచేస్తున్న వారికి వెంటనే వేతన బకాయిలను చెల్లించాలి. 161 మండలాల్లో సర్వశిక్షాభియాన్‌ ద్వారా గ్రామసచివాలయాల భవనాల నిర్మాణం. కొత్తగా మంజూరు చేసిన స్కూల్  ప్రహరీ నిర్మాణాలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలి. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పనులను ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ  గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌  గిరిజాశంకర్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్ కుమార్‌,  పిఆర్ ఇఎన్‌సి సుబ్బారెడ్డి, ఆర్ డబ్ల్యుఎస్‌ ఇఎన్‌సి కృష్ణారెడ్డి, సర్వశిక్షాభియాన్ ఎస్‌ఇ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

 

పేదల ఇళ్ల స్థలాల స్టోనింగ్ వేగవంతం

 

Tags:Review of Minister Peddi Reddy Ramachandra Reddy on Employment Guarantee Scheme

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *