Natyam ad

నగర అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష

కడప ముచ్చట్లు:

కడప నగర మేయర్ కె.సురేష్ బాబు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషాతో కలిసి.. కడప నగర అభివృద్ధి పనుల పురోగతిపై.. నగర కమీషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్, ఇంచార్జి కలెక్టర్ రాహుల్ మీనా లతో సమీక్షించారు.శనివారం కడప నగరపాలక సంస్థ మేయర్ ఛాంబర్ లో.. నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో.. కడప నియోజక వర్గంలోని డివిజన్లకు మంజూరైన అభివృద్ధి పనులు -15th ఫైనాన్స్ పనుల పురోగతి పై.. ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, నగర మేయర్ & వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు లతో సంబందిత మున్సిపల్ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో నగర కార్పొరేటర్లు, వైస్సార్సీపీ కార్పొరేటర్లు చెన్నయ్య, కిరణ్, మల్లికార్జున, శ్రీరంజన్, సుబ్బారాయుడు, సూర్యనారా యణ, రెడ్డి ప్రసాద్, బంగారు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Review of progress of city development works

Post Midle
Post Midle