శ్రీవారి రథోత్సవం ఏర్పాట్లపై తిరుమల జెఈవో సమీక్ష

Review of Tirumala CEO on the provisions of Sri Ravi Rathothana

Review of Tirumala CEO on the provisions of Sri Ravi Rathothana

Date:19/09/2018
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం రథోత్సవం జరుగనున్న నేపథ్యంలో విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశముందని, రద్దీకి తగ్గట్టు పటిష్టంగా ఏర్పాట్లు చేపట్టాలని తిరుమల జెఈవో  కె.ఎస్.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. రథోత్సవం ఏర్పాట్లపై తిరుమలలోని రాంభగీచా విశ్రాంతి గృహాల ఎదురుగా గల బ్రహ్మోత్సవ సెల్లో బుధవారం తిరుమల జెఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ రథాన్ని లాగే క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టిటిడి ఇంజినీరింగ్, భద్రత, పోలీసు విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. రథం బ్రేకులను ముందస్తుగా పరిశీలించి సక్రమంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రథం తిరిగే క్రమంలో ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సీనియర్ అధికారులు అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
పల్లం ఉన్న ప్రాంతాల్లో రథం వేగంగా వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చక్రాల వద్దకు  భక్తులు  రాకుండా నిర్దేశిత ప్రాంతంలో ఉండేలా జాత్రగ్తలు తీసుకోవాలన్నారు. రథం లాగేందుకు వినియోగించే తాడు పటిష్టంగా ఉండేలా చూడాలన్నారు. రథోత్సవంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మైక్ల ద్వారా అనౌన్స్ చేయాలని సూచించారు. మాడ వీధుల్లో రథం కోసం వేసిన ఇసుకను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. నాలుగు మాడ వీధులతో పాటు వైభవోత్సవ మండపం వద్ద అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
Tags:Review of Tirumala CEO on the provisions of Sri Ravi Rathothana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *