గిరిజన యూనివర్సిటీ కోర్సులపై సమీక్ష

Review of tribal university courses

Review of tribal university courses

Date:11/01/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
గిరిజన యూనివర్సిటి ద్వారా వచ్చే జులై నుండి ఆరు కోర్సులలో 30 విద్యార్ధుల చొప్పున తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో సి.యస్ డా.ఎస్.కె.జోషి గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ, అటవీశాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి అధికారులతో గిరిజన యూనివర్సిటిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటి ద్వారా జాకారం వద్ద ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్  లో తరగతుల నిర్వహణను చేపట్టాలని, అందుకనుగుణంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి అధికారులు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. యూనివర్సిటిలో స్ధానిక గిరిజన యువత కోసం 30 శాతం సూపర్ న్యూమరి సీట్లను కేటాయించాలని సి.యస్ అన్నారు.  బీయే (హోటల్ మేనేజ్మెంట్), బీసీయే, ఎంసీయే (మార్కెటింగ్, ప్యాకేజింగ్) బీబీయే, మాస్టర్స్ ఇన్ ట్రైబల్ కల్చర్ ఫోక్లోర్ కోర్సులలో తరగతులు ప్రారంభించాలన్నారు. కాంపౌండ్ హాల్ నిర్మాణాన్ని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం చేపట్టాలన్నారు. ఈ యూనివర్సిటి ద్వారా స్ధానిక గిరిజన విద్యార్ధుల విద్యాభివృద్ధికి, గిరిజనుల ఆర్ధికాభివృద్ధికి తోడ్పతుందని అన్నారు.
భూసేకరణకు సంబంధించి 10 కోట్ల రూపాయలను గిరిజన సంక్షేమ శాఖ జయశంకర్ భూపాలపల్లి  జిల్లా కలెక్టరుకు ఇవ్వాలన్నారు. అటవీశాఖకు సంబంధించిన భూమిలో అటవీ చట్ట నిబంధనలలో అనుమతించిన మేరకు గిరిజన సంస్కృతికి  సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గిరిజన యూనివర్సిటి కమిటిలో ఉన్నత విద్య, గిరిజన సంక్షేమం, అటవీశాఖ ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా నియమించాలన్నారు. తరగతుల నిర్వహణకు అవసరమైన పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. తగు యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని ముందుకు సాగాలన్నారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ఫ్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా, కమీషనర్ క్రిస్టినా చౌంగ్తు, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్  రాసం వెంకటేశ్వర్లు, ప్రొఫేసర్ రాజశేఖర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags:Review of tribal university courses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *