ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులపై సమీక్ష

Date:04/06/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

వివిధ శాఖల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడం కోసం కేటాయించిన నిధులతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను  ఏకీకృతం    చేయటానికి తగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
గురువారం బిఆర్ కెఆర్ భవన్ లో వివిధ శాఖలలో ఎంఎన్ఆర్ఈజీఎస్  పనుల ఏకీకృతం   పై సమీక్షా సమావేశం నిర్వహించారు.  వివిధ శాఖలలో చేపట్టే పనుల గుర్తింపుతో పాటు, ఎంఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పనులు చేపట్టడానికి సీజనల్ క్యాలెండర్ ను రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలు అధిక నిధులు పొందేలా గ్రామాలలో పెద్ద ఎత్తున ఉపాధి హామి పనులు చేపట్టి గ్రామీణ యువతకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  ఆదేశించారని సి.యస్ తెలిపారు.

 

 

 

ఉపాధి హామీ, వివిధ శాఖలకు కేటాయించిన నిధులతో ప్రభుత్వ ప్రాధాన్య పనులైన వైకుంఠధామాలు, డంప్ యార్డులు, రైతు వేదికలు, కలములు,  గ్రామీణ పార్కులు,     గొర్రె-పశువుల షెడ్ల నిర్మాణాల పనులతో పాటు ఫీడర్ చానళ్లు, ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీల డీసెల్టింగ్, హౌసింగ్ కాలనీలలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పనులు చేపట్టడం పై దృష్టి సారించాలన్నారు. ఉపాధి హామీ పనులలో వివిధ శాఖలు ఆక్టివ్ రోల్ పాటించాలన్నారు. వివిధ పనులకు సంబంధించి స్టాండడ్ డిజైన్స్ – ఎస్టిమేట్స్ రూపొందించాలని గ్రామ, మండల, జిల్లాల వారిగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు.

 

 

 

ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి  సందీప్ కుమార్ సుల్తానియా, సి.ఎం.ఓ కార్యదర్శి  స్మీతా సభర్వాల్,  పిసిసిఎఫ్ శోభ, ఓఎస్ డి  టు సి.యం ప్రియాంక వర్గీస్, పిఆర్ అండ్ ఆర్ డి కమీషనర్ రఘునందన్ రావు, గిరిజన శాఖ కమీషనర్ క్రిస్టినా చొంగ్తు, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పదోన్నతులతో పాటు భాధ్యతలు పెరుగుతాయి

Tags: Review on MNREGS funding

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *