మంత్రి పెద్దిరెడ్డి అధికారులతో సమీక్ష

Review with Minister Peddi Reddy's officials

Review with Minister Peddi Reddy's officials

– ఏర్పాట్లలో పెద్దిరెడ్డి , అధికారులు

Date:18/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలిసారిగా సదుంలో జిల్లా అధికారులతో శనివారం అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మాజీ జెడ్పిటిసి సోమశేఖర్‌రెడ్డి కలసి ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి అధికారుల సమీక్షకు అవసరమైన ఏర్పాట్లను పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు ఎంపీడీవో వెంకటరత్నం, ఏపిడి నందకుమార్‌రెడ్డి, ఏపివో శ్రీనివాసులు, ఈవోఆర్‌డి వరప్రసాద్‌ చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి మంత్రి జిల్లా అధికారులతో సాయంత్రం దాక సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు భోజన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ మంత్రి తొలిసారిగా నిర్వహిస్తున్న అధికారుల సమీక్షకు అన్నిశాఖల అధికారులు తప్పక హాజరుకావాలెనని కోరారు. మండలాల వారిగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల నివేదికలను తీసుకురావాలని సూచించారు.

టివి ఆర్టిస్ట్ గోకుల్‌ సాయికృష్ణ మృతి

Tags: Review with Minister Peddi Reddy’s officials

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *