బన్నీ ఉత్సవాల నిర్వహణపై సమీక్షలు

Date:09/10/2018
కర్నూలు ముచ్చట్లు:
ఆలూరులోని దేవరగట్టు సమీపంలోని బన్ని ఉత్సవాల నిర్వహణపై ఏర్పాట్లు చేయాలని, హింసకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకుగాను చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌పి గోపినాథ్‌జెట్టి వెల్లడించారు.దేవస్థానం పరిధిలో జరుగుతున్న బన్ని ఉత్సవాలకు ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
దేవాలయం చుట్టూ పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ఈ ఉత్సవాలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు నీటి వసతి కల్పనపై దృష్టి సారించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ హరిబాబును ఆదేశించారు. ఉత్సవాలకు రెండు రోజుల ముందే మద్యం షాపులను మూసివేయాలన్నారు. ఎక్కడైనా సారా బట్టీలుంటే వాటిని వెంటనే ధ్వంసం చేయాలని ఆదేశించారు. దేవస్థానంలో లైటింగ్‌ సౌకర్యం కల్పించి, సిసి కెమెరాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని సూచించారు. ముందస్తుగా గుర్తించిన ప్రాంతాల్లో వైద్య బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.
108, అంబులెన్సు వాహనాలను సిద్ధం చేయాలని తెలిపారు. ఈ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో డాక్టర్లు, ఇతర సిబ్బంది సంఖ్యను రెట్టింపు తీసుకోవాలని సూచించారు. అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలన్నారు. ఎస్‌పి మాట్లాడుతూ దేవరగట్టు బన్ని ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోలీసు యంత్రాంగానికి అధికారులు సహకరించాలని కోరారు.
Tags: Reviews of Bunny Festival Management

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *