Date:05/12/2020
హైదరాబాద్ ముచ్చట్లు:
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లుగా, ఒక ప్రయత్నం ఐదుగురికి ప్రాణం పోసింది. ఈ కీర్తిని మూట గట్టుకున్నారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ పేషెంట్ కుటుంబాన్ని ఒప్పించి అవయవదానం చేయించడం ద్వారా మరో ఐదుగురికి ప్రాణం పోశారు.
శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసుల పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. వివరాల్లోకి వెళితే, నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం లోని చెన్నై చింత గ్రామానికి చెందిన మాధవరం కమలాకర్ రావు కుటుంబం గత కొంత కాలంగా రాజేంద్రనగర్ పరిధి లోని దుర్గానగర్ లో నివాసం ఉంటోంది. చికెన్ షాపు నిర్వహిస్తున్న కమలాకర్ రావు గత మూడు రోజుల క్రితం దుర్గానగర్ నుండి ఆటోలో శంషాబాద్ కు బయలు దేరాడు. అయితే సాతంరాయి వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కమలాకర్ రావు ను హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆర్జీఐఏ పోలీసులు. అయితే బ్రెయిన్ డెడ్ గా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఒక ఐడియా జీవితాన్నే మార్చేసినట్లుగా పోలీసులు జీవన్ దాన్ సంస్థ తో కలిసి కమలాకర్ రావు కుటుంబ సభ్యుల కు కౌన్సిలింగ్ ఇచ్చి అవయవదానం చేయడానికి ఒప్పించారు. పోలీసుల ప్రయత్నం ఫలించడంతో అవయవదానానికి మృతుడి కుటుంబం అంగీకరించారు. దీంతో ఆగమేఘాల మీద కమలాకర్ రావు అవయవాలను సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో ఐదుగురికి ప్రాణం పోశారు.
చిన్నారిని చితకబాది హతమార్చిన తండ్రి
Tags: Revival for five