అన్యవర్గ దోరణులు విడనాడి విప్లవసంస్థలు ఏకం కావాలి

– చండ్రపుల్లారెడ్డి 36 వ వర్ధంతి సభలోవక్తల పిలిపు

Date:30/11/2020

హైద్రాబాద్  ముచ్చట్లు:

విప్లవ సంస్థలు భారత విప్లవోద్యమ ప్రయొజనాలను ద్రుష్టిలో పెట్టుకుని తమతమ సంకుచిత, అన్యవర్గ దోరణులు విడనాడి విప్లవసంస్థలు ఏకం కావలసిన అవసరం నేడు విప్లవకారులముందు ఉన్నదని వక్తలు పేర్కొన్నారు. -కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి 36 వ వర్ధంతి సభ సోమవారం నగరం లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని శోయబ్ హాలులో సిపిఐ(ఎం-ఎల్)ప్రతిఘటన, సిపిఐ(ఎం-ఎల్)రెడ్డ్ ఫ్లాగ్, సిపిఐ(ఎం-ఎల్) రాంచంద్రన్ విప్లవ సంస్థల ఆద్వార్యంలో జరిగినది. సభకు రాపర్తి ధర్మన్న(తెలంగాణ రైతు-కూలీ సంఘం, రాష్ట్ర కన్వీనర్), సంపంగిపద్మక్క(అఖిల భారత విప్లవ మహిళా సంఘం, రాష్ట్ర కన్వీనర్), ఎల్లుట్ల ఉపేందర్(సిపిఐ(ఎం-ఎల్)రాంచంద్రన్, రాష్ట్ర కమిటి సభ్యులు) అద్యక్ష వర్గంగా కొనసాగారు. ఈపై కార్యక్రమంలోమల్లెపల్లి ప్రబాకర్, మరీదు ప్రసాదు బాబు(సిపిఐ(ఎం.ఎల్)రెడ్డ్ ఫ్లాగ్, తెలంగాణ-ఆంద్రా రాష్ట్రల కార్యదర్శులు, కేంద్రకమిటి సభ్యులు), షేక్ షావలి, కే.జేమ్స్ (సిపిఐ(ఎం.ఎల్) ప్రతిఘటనతెలంగాణ-ఆంద్ర నాయకులు), భుద్ద సత్యనారాయణ, నెమలి వెంకటేశ్ (సిపిఐ(ఎం.ఎల్)రాంచంద్రన్ రాష్ట్ర నాయకులు), కే.నర్సన్న,ఎం.డి.లాల్ ఖాన్(ఐ.ఎఫ్.టి.యు, ఆంద్ర-తెలంగాణకార్యదర్శులు), నిజమాబాద్ సుదాకర్(ఎ.ఐ.ఎఫ్.టి.యు, రాష్ట్ర కార్యదర్శి), బి.రాజన్న(ఆంద్రప్రదేశ్ రైతు-కూలీ సంఘం రాష్ట్ర అద్యక్షులు మరియు అల్లూరి సీతారామరాజు పోరాట సమితిరెండు తెలుగురాష్ట్రాల కన్వీనర్), బానోతు సంతోష్ నాయక్(కపూర్ నాయక్ తండా సర్పంచ్, పివైఎల్ రాష్ట్ర కన్వీనర్), రషీద్(దక్షిణ భారత రాజకీయ సమఖ్యా జాతీయ అద్యక్షులు), ఆలూరి

 

 

 

సావిత్రి,(సావిత్రి జ్యోతిరావు పూలే మహిళాసంఘం రాష్ట్ర కన్వీనర్), వేమూరీ భాస్కర్, రాము(సిపిఐ(ఎం.ఎల్)రెడ్డ్ ఫ్లాగ్ ఖమ్మం జిల్లా నాయకులు), ఎస్.కే.సైదులు(తెలంగాణ రైతు-కూలీ
సంఘం మహభుబాబాద్ జిల్లా కార్యదర్శి), పిడికల సంపత్(అరుణోదయ సాంస్క్రతిక సమాఖ్య రాష్ట్ర కన్వీనర్) తదితరులు పాల్గొని ప్రసంగించారు. భూమి,భుక్తి,పీడిత ప్రజల విముక్తికోసం
చివరివరకు పోరాడి ప్రాణాలు దారపోసిన అమరవీరులకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనమైన విప్లవ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా నేతలు
మాట్లాడుతూ భారత విప్లవోద్యమ నిర్మాణానికి సరైన “పంథా” రూపొందించిన కామ్రేడ్ సి.పి.అని అన్నారు.  అర్థవలస-అర్థభూస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో భలమైన విప్లవనిర్మాణానికి, విజయానికి కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి(సిపి)గారు స్వయంగా ఆచరించి, నిర్మించి, రూపొందించిన “గోదావరిలోయ ప్రతిఘటన పోరాట పంథా” సరైనదని సిపిరెడ్డి 36 వ వర్ధంతిసభలో వక్తలు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, దేశ ప్రదాని, హోంమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆన్ని రకాల దుర్మార్గ,

 

 

అమానుష, అప్రజాస్వామిక ప్రజావ్యతిరేక విదానాలకు వ్యతిరేఖంగా వర్గపోరాటాలను, ప్రజాఉద్యమాలను తీవ్రతరం చేయాలని విప్లవ ప్రజానీకానికి పిలుపునిచ్చిరు. కుల‌,మత,
ప్రాంతీయత్తత్వం లాంటి వేర్పాటువాద ఉద్యమాలు వ్యవసాయిక విప్లవోద్యమాలను, పీడిత వర్గాలను విచ్చిన్నం చేసెందుకు దోపిడి పాలకవర్గాలు ఉపయోగించే పదునైన ఆయుధాలని
గుర్తుచేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న అన్నిరకాల సమస్యల పరిష్కారానికి నూతన ప్రజాస్వామిక విప్లవం విజయం ద్వారానే అది సాద్యమని గుర్తుచేశారు. అదేవిదంగా పౌర-ప్రజాస్వామిక
హక్కులకోసం, మనిషిని మనిషి ప్రేమించే సమాజంకోసం, సమసమాజ స్థాపనకోసం ప్రశ్నిస్తూ ఉద్యమించే కవులు, కళాకారులు, మేధావులు, అభ్యుదయవాదులను ఎలాంటి విచారణ
చేపట్టకుండా సంవత్సరాల తరబడి జైలులో ఉన్నవారిని రాజకీయ ఖైదీలుగా గుర్తించి తక్షణమే విడుదల చేయాలని సభా ముఖంగా డిమాండ్ చేశారు. దేశ రాజదాని డిల్లీలో రైతు వ్యతిరేఖ
బిల్లులను తీవ్రంగా నిరసిస్తూ గత మూడు రోజులుగా ఒకకోటి ఇరవైఐదు లక్షల మంది రైతులు, రైతుకూలీలు  ప్రజాస్వామికమైన శాంతియుత ప్రదర్శన జరుపుతున్ననిరసనకారులపై నరేంద్ర
మోదీ-అమిత్ షాల కేంద్ర బలగాలు లాఠీజార్జీ, వాటర్ క్యాన్లు, బాష్పవాయులతో దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈసభలో అరుణోదయ కళాకారులు రాజు, మమత, చిన్నారి
ఐశ్వర్య పాడిన పాటలు సభికులను ఉత్తెజపరిచాయి.

ధర్మపురి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

Tags: Revolutionary organizations must unite, leaving apartheid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *