రేవంత్ దిష్టిబొమ్మ దగ్దం

హైదరాబాద్ ముచ్చట్లు:
ఎల్ బి నగర్ ఎమ్ ఎల్ ఏ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పై ఎమ్ పి రేవంత్ రెడ్డి ఆరోపణలు ఖండిస్తూ బి ఎన్ రెడ్డి నగర్ డివిజన్ టి ఆర్ ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి, మల్ రెడ్డి సోదరుల దిష్టి బొమ్మలతో శవయాత్ర చేసి బి ఎన్ రెడ్డి చౌరస్తాలో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ 2017 లో రేవంత్ రెడ్డి టిడిపి నుండి వెళ్ళిపోయినప్పుడు స్పీకర్ కి రాజీనామా ఇవ్వకుండా అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇప్పడు సుధీర్ రెడ్డి పై పార్టీ ఫిరాయింపుల విషయంలో రాళ్లతో కొట్టండి అని మాట్లాడటం సరికాదని ప్రజాస్వామ్యములో ఉన్నామని మరిచి రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని కండిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి నువ్వు ఎమ్ పి గా గెలిచి 2 సంవత్సరాలు గడిచిన ఎల్ బి నగర్ కి రెండు సార్లు వచ్చావని, నిన్ను ఎల్ బి నగర్ లో తిరగనియ్యకుండా చేస్తామని హెచ్చరించారు, ఇంకా మల్రెడ్డి సోదరులు గతం లో ఎమ్ ఎల్ ఏ గా చేసి అవినీతి చేసినందుకు ఇప్పటికి ప్రజలు ఓడగొడుతున్నారని ఇక నైనా తమ ఎమ్ ఎల్ ఏ పై ఇలాంటి మాటలను మానుకోవాలని టి ఆర్ ఎస్ నాయకులు హెచ్చరించారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Rewanth effigy burned

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *