సీనియర్లను కలుస్తున్న రేవంత్

హైదరాబాద్ ముచ్చట్లు :

టీపీసీసీ చీఫ్‌గా నియామకం అయిన తర్వాత రేవంత్ రెడ్డి వరుసగా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం పొన్నాల లక్ష్మయ్యతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు రేవంత్. మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా రేవంత్‌కు పుష్పగుచ్చం ఇచ్చి శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు పొన్నాల.ఆ తర్వాత వీహెచ్‌ను కలిశారు రేవంత్. హైదర్ గూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు ను కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. వీహెచ్‌ కోలుకున్నారన్నారు. అయితే వీహెచ్, రేవంత్ రెడ్డి పీసీసీ రేసులో ఉన్నప్పుడే ఆయనను వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీనిపై హైకమాండ్‌కు లేఖ కూడా రాశారు వీహెచ్.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Rewanth meeting seniors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *