రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కి పూర్వవైభవం బతికేపల్లిలో స్వీట్లు పంపిణి చేసిన సర్పంచ్ శోభారాణి

జగిత్యాల ముచ్చట్లు :

నూతన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి అన్నారు.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అనుముల రేవంత్ రెడ్డి  నియమితులైన  సందర్భంగా బతికేపెళ్లి  సర్పంచ్ తాటిపర్తి శోభారాణి  ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో స్వీట్ల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శోభారాణి  మాట్లాడుతూ తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితులకనుగుణంగా రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగత్తిస్తున్నామని చెబుతూ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జక్కుల మల్లేశం వార్డు సభ్యులు  జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ గౌడ్,  మహేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, రాజు,రవి,కాజ,నర్సయ్య,  శ్రీనివాస్ రెడ్డి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Rewanth Reddy led the prestige of the Congress
Sarpanch Shobharani who distributed sweets in Bathikepally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *