7న రేవంత్ బాధ్యతలు..గాంధీభవన్ లో వాస్తు మార్పు

హైదరాబాద్   ముచ్చట్లు:
ఈ నెల 7న రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే గాంధీ భవన్ లో వస్తూ నిపుణులు, వేద పండితులు పర్యవేక్షించారు. గాంధీ భవన్ లో ఎంట్రీ పాయింట్ ను మార్చుతున్నారు పార్టీ కొత్త కమిటీ నేతలు. ఎంట్రెన్స్ ను గాంధీ భవన్ క్యాంటీన్ నుండి పాత గేట్ నుండి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు.గాంధీ భవన్ లో పార్టీ జెండాలు అమ్మే రూమ్ , సెక్యూరిటీ రూంలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్‌ పార్టీ. గాంధీ భవన్ తూర్పు ఈశాన్యం వైపు ఎలాంటి బరువు ఉండకుండా ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు. అలాగే గాంధీ భవన్ ఆవరణలో ఎలాంటి కట్టడాలు లేకుండా కేవలం గాంధీ విగ్రహం మాత్రమే ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తు కారణంగానే కొన్ని వందల కోట్లు దుబారా చేసి.. కొత్త సచివాలయం కడుతున్నారని కూడా ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఆయన కూడా వాస్తుబాటలోకే వెళ్లారు. పీసీసీ చీఫ్‌గా హైకమాండ్ నియమించిన వెంటనే.. రేవంత్ రెడ్డి సీనియర్లను బుజ్జగించడమే కాదు … వాస్తుపై కూడా దృష్టి పెట్టారు. గాంధీ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. గాంధీభవన్‌ తూర్పు వైపు మరో ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఛాంబర్‌ తూర్పులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతకు ముందు గాంధీ భవన్‌లో ప్రచార సామాగ్రి అమ్మే గది ఉండేది. దాన్ని తొలగిస్తున్నారు. సెక్యూరిటీ రూమ్ గదిని కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏడో తేదీన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆ రోజుకల్లా పనులు పూర్తి చేయాలని రేయింబవళ్లు పనులు చేయిస్తున్నారు. గాంధీ భవన్‌ ఇప్పటికే రేవంత్ అనుచరుల హవాలో ఉంది. మొత్తం వారే దగ్గరుండి .. వ్యవహారాలు చూసుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి తెలియకుండా.. వాస్తు మార్పులు జరుగుతాయని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయ నేతలు.. సినీ తారలకు నమ్మకాలు ఎక్కువ. వాస్తు పరంగా.. సంఖ్యా శాస్త్ర పరంగా కూడా.. అదృష్టాన్నీ పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే కేసీఆర్ వాస్తు నమ్మకాన్ని ఎగతాళి చేసే రేవంత్ రెడ్డి.. తాను ఎక్కువగానే వాస్తును నమ్ముతారని ఎవరూ అనుకోలేదు. కానీ ఇప్పుడు ఎందుకైనా మంచిదన్నట్లుగా గాంధీభవన్‌కు వాస్తు మార్పులు చేపిస్తూ ఆశ్చర్య పరుస్తున్నారు. ఈ మార్పులు.. కాంగ్రెస్‌కు మంచి రోజులు తీసుకు వస్తే.. అవి రేవంత్ తీసుకు వచ్చినట్లే.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Rewanth responsibilities on the 7th .. Vastu change in Gandhi Bhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *