రేవంత్ స్కెచ్…చాపక్రింద నీరులా

మహబూబ్ నగర్  ముచ్చట్లు:


ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీని వీడి పోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ, తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ విషయంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రెండు సార్లు అధికారంలోకి వచ్చి మూడోసారి సైతం తమదే విజయం అని ధీమాతో ఉన్న గులాబీ పార్టీ పరిస్థితి ‘ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకీల మోత’ అన్నట్లుగా తయారైంది. స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి సర్దిచెప్పినా కొల్లాపూర్ నియోజకవర్గంలో వర్గపోరు సమసిపోకపోవడం టీఆర్ఎస్‌ను మరింత కలవర పెడుతోందట.ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇతర పార్టీల్లోకి సొంత పార్టీ నేతలు జంప్ అవుతుండటం గులాబీ పార్టీ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య టగ్ ఆఫ్ వార్ పార్టీ పరువును బజారుకీడుస్తోందనే టాక్ వినిపిస్తోంది. నేతల మధ్య సయోధ్య కుదర్చేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేసినా జూపల్లి ఎక్కడా వెనక్కి తగ్గకపోవడంతో ఆయన వెనుక ఉన్నదెవరూ అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎమ్మెల్యేకు జూపల్లికి మధ్య ‘సవాళ్ల’ రాజకీయం కొనసాగుతుండగా గత ఆదివారం అది పీక్ స్టేజీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలని పార్టీ పెద్దలే చెప్పినా జూపల్లి మాత్రం తన జోరుతు తగ్గించడం లేదు. ఎమ్మెల్యే చర్చకు రావాల్సిందే అని పట్టుపడుతున్నారు.

 

 

దీంతో జూపల్లి స్పష్టమైన ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారనే చర్చ తెరపైకి వస్తోంది. అయితే జూపల్లికి అలా చేయమని ఆదేశించింది ఎవరు? జూపల్లిని వెనుకుండి ఆడిస్తున్నదెవరూ? వారి వ్యూహం ఏమై ఉంటుందనేదానిపై రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.కొంత కాలంగా జూపల్లి టీఆర్ఎస్ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతారనే టాక్ వచ్చింది. కానీ, ఆ పార్టీలో ఉన్న డీకే ఆరుణతో జూపల్లికి రాజకీయ వైరం ఉందని అందువల్లే బీజేపీ వైపు కాకుండా గాంధీ భవన్ మెట్లు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జూపల్లి మంత్రిగా పని చేశారు. పార్టీతో గతంలో జూపల్లికి ఉన్న అనుబంధం కారణంగా రేవంత్ రెడ్డి వెనుకుండి ఇదంతా నడిపిస్తున్నాటనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరాలని జూపల్లిని కోరడంతో పాటు అందరిలా పార్టీలో చేరకుండా సాధ్యమైనంత వరకు అదే పార్టీలో ఉంటూ టీఆర్ఎస్‌ను ఇబ్బంది పెట్టి ఎన్నికల సమయానికి కాంగ్రెస్ కండువా కప్పేలా రేవంత్ రెడ్డి స్కెచ్ వేసినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట.పార్టీ మార్పు విషయంలో ఇప్పటికే అనేక సందర్భంలో జూపల్లి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని చెప్పారు. అయితే ఇటీవల ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడిన జూపల్లి పార్టీ మార్పుపై మరోసారి స్పందించారు. పార్టీ మారబోతున్నారా? అనే ప్రశ్నకు ప్రస్తుతానికి తాను టీఆర్ఎస్‌లో ఉన్నానంటూ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ లభిస్తే టీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ నుండి పోటీ చేయబోతున్నారనే టాక్ జోరుగా సాగుతోంది.

 

Tags: Rewanth sketch … like water under the mat

Leave A Reply

Your email address will not be published.