జీహెచ్‌ఎంసీ మీటింగ్ కు రేవంత్

హైదరాబాద్ ముచ్చట్లు:

 

 

టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నిక అయిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆయనకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పుష్పగుచ్చం ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి గెలుపొంది మేయర్‌గా ఎన్నికయ్యారు.ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్‌గా ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి గెలుపొందారు. కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే మంగళవారం జరిగిన కౌన్సిల్ వర్చువల్ మీటింగ్‌కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి వచ్చారు. కార్పొరేటర్‌గా ధర్పల్లి రాజశేఖర్ రెడ్డితో ప్రమాణం చేయించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. అనంతరం పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.అమితు వర్చువల్ మీటింగ్‌కు ఆన్‌లైన్‌లో హాజరు కావాల్సి ఉండగా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కార్పొరేటర్ శేఖర్ రెడ్డి‌తో కలిసి నేరుగా వర్చువల్ సమావేశం జరుగుతున్న కమాండ్ కంట్రోల్ రూమ్‌కు రావటం చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్ నేతగా ఉండి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు రేవంత్‌కు శుభాకాంక్షలు చెప్పడం కూడా హాట్‌టాపిక్‌గా మారింది.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

 

Tags:Rewanth to GHMC meeting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *