Natyam ad

పుంగనూరులో ఆర్టీసి ప్రయాణికులకు బహుమతులు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు డిపో ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించిన ప్రయాణికులకు బహుమతులు పంపిణీ చేసినట్లు డిఎం సుధాకరయ్య తెలిపారు. బుధవారం లక్కిడిప్‌ ద్వారా గెలుపొందిన ప్రయాణికులు వెంకట్రమణ, జమ్రూత్‌జాన్‌, లోకేష్‌, మల్లికార్జున , బావాజాన్‌, బాషా, పుణిత్‌, సంజనారెడ్డి లకు బహుమతులు పంపిణీ చేశారు. రాయచోటి, ముళబాగిల్‌, దొడ్డిపల్లి , తిరుపతి, మేటిమంద, కలికిరి రూట్లలో ప్రయాణించే వారికి లాటరీ ద్వారా బహుమతులు పంపిణీ చేస్తున్నట్లు డిఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ సంధ్య, మెకానికల్‌ సూపరింటెండెంట్‌ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Rewards for RTC passengers in Punganur

Post Midle