Natyam ad

పుంగనూరులో ఆర్టీసి ప్రయాణికులకు బహుమతులు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఆర్టీసి డిపో బస్సుల్లో ప్రయాణించే ప్రజలకు బహుమతులు ఇస్తున్నట్లు బుధవారం డిఎం సుధాకరయ్య తెలిపారు. పుంగనూరు,ముళబాగిల్‌, రాయచోటి, మేటిమంద, కలికిరి,రాయచోటి, ముళబాగిల్‌ ప్రయాణికులకు బహుమతులు పంపిణీ చేశారు. బహుమతులు అందుకున్న వారిలో అబ్ధుల్‌ఖాదర్‌, ధనలక్ష్మీ, యుగంధర్‌, నాగమ్మ, నఫెసన, ఫయాజ్‌హుసేన్‌, మీనాక్షి, గంగాధర్‌ లకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌సూపర్‌ వైజర్‌ సంధ్య, సిబ్బంది రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Rewards for RTC passengers in Punganur

Post Midle