నిరుపేదలకు, నిరాశ్రితులకు బియ్యం, పప్పులు నిత్యావసర వస్తువుల ప్రదానం

Date:30/03/2020

నిర్మల్ ముచ్చట్లు:

జననీ జన్మభూమి స్టూడెంట్స్ సూసైడ్స్ అండ్ క్రైమ్స్ ఎరాడికేషన్  సొసైటీ నిర్మల్ జిల్లా వారి ఆధ్వర్యం లో కడెం ప్రాంతంలో ఈ  హానికర కరోనా వైరస్ వ్యాపిస్తున్న సందర్భంలో నిరుపేదలకు, నిరాశ్రితులకు   కర్ఫ్యూ కారణంగా కరువు పరిస్థితుల దృష్ట్వా  వారికి బియ్యం పప్పులు, నిత్యవసర  సామాగ్రి ని ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా వారికి కరోనా నివారణ పద్ధతులు, చర్యలు చెప్పడం జరిగింది.
ఈ మానవ సేవ కార్యక్రమాన్ని జెజెఎస్ వ్యవస్థాపకుడు కొమురవెల్లి భూమేశ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటరమణ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దం చందు, సహాయ కార్యదర్శి కె.రమేశ్ ,సభ్యుడు జి.రాజేందర్ పలువురు ప్రముఖులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిట్యాల చిన్నయ్య పలువురు ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా జెజెఎస్ సభ్యులు  మాట్లాడుతూ మానవత్వం తో   నిరుపేదలకు, అనాథలకు సేవచేయడం, ఆదుకోవడం దైవకార్యం గా, పుణ్యకార్యం అని అన్నారు.

 సామాజిక దూరంతోనే కరోనకు పరిష్కారం…. ఎమ్మెల్యే జోగు రామన్న.

Tags:Rice, pulses, essentials for poor and destitute under JJS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *