పోలీసులు పట్టించుకోలేదని సెల్ టవర్ ఎక్కిన రిక్షావాలా..
-సెల్ టవర్ ఎక్కిన రిక్షావాలా
భీమవరం ముచ్చట్లు:
తన పిర్యాదుపై పోలీసులు పట్టించుకోలేదని ఒక రిక్షా వాలా సెల్ టవర్ ఎక్కాడు. భీమవరం ఎమ్మార్వో ఆఫీస్ ప్రాంగణంలో రిలయన్స్ టవర్ ను వసంతరావు (54) ఎక్కేసాడు. తనతో పని చేసే వ్యక్తులు రాత్రి తన రిక్షాను లాక్కుని తనపై దాడి చేశారని ఆరోపించాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసిన సరిగా పట్టించుకోలేదని, మనస్థాపానికి గురై మద్యం సేవించాడు. తాగిన మైకంలో రాత్రి 10 :00 గంటల సమయంలో సెల్ టవర్ ఎక్కానని చెప్పాడు. రాత్రి అంతా టవర్ పై నే నిదురించాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఆర్ఐ మీ సమస్యను పరిష్కరిస్తాం అని భరోసా ఇవ్వడంతోచివరకు వసంతరావు సెల్ టవర్ దిగాడు.

Tags: Rickshawala climbed the cell tower that the police did not pay attention to.
