హక్కుల నేత  స్థాన్ స్వామి మృతిపై న్యాయవిచారణ జరిపించాలి

ముమ్మిడివరం ముచ్చట్లు:

 

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం లో ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘా లు,విద్యార్థి సంఘాలు ప్రతినిధులు హక్కుల నేత స్థాన్ స్వామి మరణంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత న్యాయ విచారణ జరిపించాలని నినాదాలతో డిమాండ్ చేశారు. సిపిఎం మండల కార్యదర్శి సఖిలే సూర్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక సమైక్యాంధ్ర శిబిరం వద్ద నుండి స్థాన్ స్వామి  మృతి ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని నాయకులు ఆరోపిం చారు.  భీమా కోరేగావ్ ఘటనలో  నిరాధారం లేని కేసుల్లో ప్రభుత్వం ఇరికించి జైలుకు పంపిందని నేతలు ఆరోపించారు. బెయిలు రాకుండా వైద్యం అందించకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మతతత్వద్వారని తో వ్యవహరి స్తుందని, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని,ప్రజా సంఘాలు హెచ్చరించాయి. అనంతరం స్థానిక తాసిల్దార్ ఎస్ పోతురాజు కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Rights leader Sthan Swamy’s death should be prosecuted

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *