హైకోర్టులో రికాల్ పిటిషన్ : పెద్దిరెడ్డి 

Rikal petition in High Court: Peddireddy

Rikal petition in High Court: Peddireddy

Date:19/09/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
ఈ నెల 22 న యూ ఏన్ ఓ లో వ్యవసాయం పై చంద్రబాబు  ప్రసంగించాలని యూ ఏన్ వో నుంచి  ఆహ్వానించారు. గతంలో వారెంట్ ను జారీ  చేసి మాకు సమాచారం ఇవ్వలేదు. ఈ నెల 21 న కోర్టు కు హాజరు కావాలని వారెంట్ ఇచ్చారు. ఈ వ్యవహారం అంతా  కుట్రపూరితంగా జరుగుతుందని టీటీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు పెద్ది రెడ్డి అన్నారు. బుధవారం అయన ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
యూ ఏన్ ఓ లో బాబు ప్రసంగించకూడదని, కుట్ర పూరితంగా నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసారని అయన ఆరోపించారు. కేసు ను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను ,సీఏస్ ను కలసాం. గవర్నర్ సానుకూలంగా స్పందించలేదని అన్నారు. నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ అయిన 16 మంది వివిధ పార్టీల లో ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇంతకుముందు నోటీసులు వచ్చాయని చెప్పలేదు.
కానీ బీజేపీ వాళ్ళు మాత్రం  అనేక సార్లు నోటీసులు ఇచ్చారని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో ఆపద్దర్మ ముఖ్యమంత్రి స్పందించలేదు. సీఏస్ పట్టించుకోవట్లేదు. గవర్నర్ ఏం చేసాడో చెప్పలేదని అయన వ్యాఖ్యానించారు. హైకోర్టు లో  రీ కాల్ పిటిషన్ వేస్తాం. కేసు బక్ అయిన వ్యక్తి అడ్రస్ లేకుంటే ఎన్బీడబ్ల్యూ జారీ చేస్తారు.
కానీ ఓక రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్రెస్ మరో రాష్రానికి తెలియక పోవడం ఏంటని అయన ప్రశ్నించారు. ఈ విషయంపై మరో సారి గవర్నర్ ను కలుస్తాం. ఈ కేసు విషయంలో ఏటువంటి చర్యలు తీసుకున్నారో గవర్నర్ ను అడుగుతామని అయన అన్నారు. గవర్నర్ స్పందించకుంటే ఒక క ముఖ్యమంత్రి విషయంలో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని భావించాల్సి ఉంటుంది. గవర్నర్ కు రెండు రోజుల సమయం ఇస్తున్నాం. స్పందించ కుంటే వేలాదిగా రాజ్ భవన్ కు వెళ్ళి కలుస్తామని అన్నారు.
Tags:Rikal petition in High Court: Peddireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *