Natyam ad

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు..అమిత్ షాపై కేసు

బెంగళూరు ముచ్చట్లు:

కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు అంటూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ భగ్గుమంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డీకే శివకుమార్ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కోరారు. ఒక సామాన్యుడు చేసి ఉంటే అరెస్ట్ చేసి ఉండేవారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మతకల్లోలాలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందన్నారు. అమిత్ షా దేశానికి హోంమంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ కాదు అని చెప్పారు.

 

 

Post Midle

తనపై 20కి పైగా కేసులు పెట్టారని చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని చెప్పారు.కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రం అల్లర్లతో అతలాకుతలం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం అన్నారు. బెళగావి జిల్లా తెర్డాల్‌లో జరిగిన ప్రచార సభలో షా మాట్లాడారు. కర్ణాటకలో బుజ్జగింపు రాజకీయాలను మాత్రమే తీసుకువస్తామని కాంగ్రెస్, హోంమంత్రి జనాలకు చెప్పారు. బిజెపిని ఎన్నుకోకపోతే అభివృద్ధి రివర్స్ గేర్ లోకి వెళ్తుందని హెచ్చరించారు. బీజేపీ మాత్రమే రాష్ట్రాన్ని కొత్త కర్ణాటక వైపు నడిపించగలదని షా పేర్కొన్నారు. మే 10న కర్ణాటకలో ఓటింగ్ జరగనుంది. మే 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

 

Tags: Riots if Congress comes to power..Case against Amit Shah

Post Midle