పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు

Date:17/02/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
రాష్ట్రంలో పంటల సాగు వ్యయం ఏడాదికేడాది పెరుగుతోంది. దీనికి తోడు దిగుబడి పడిపోతోంది. విత్తనాల నుంచి ఎరువులు, పురుగు మందుల ధరలు, కూలీల రేట్లు, ట్రాక్టర్, వరికోత యంత్రాల అద్దె ఇబ్బడి ముబ్బడిగా పెరగగా, వరి, పత్తి, సోయాబీన్ పంటల దిగుబడులు పడిపోయాయి. ఈ ఏడాదికి సంబంధించిన పంటల సాగు వ్యయం వివరాల ను ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌కు సమర్పించింది. వీటిని గత ఏడాది ఇచ్చిన నివేదికతో పోలిస్తే ఈ విషయం బోధపడుతున్నది. గత ఏడాది ఎకరా సాధారణ రకం వరి సాగు ఖర్చు రూ.28,066 కాగా, అది ఈసారి రూ.32,103కు పెరిగింది. అందులో భూమిని చదును చేసేందుకు, దున్నడానికి, విత్తనాలు, ఎరువులతో పాటు కూలీల ఖర్చు అధికంగా ఉంది. కాంప్లెక్స్ ఎరువుల్లో ఎకరా వరికి ఫాస్పరస్ వాడకంతో 2017లో రూ.1287 ఉండగా, 2018లో రెట్టింపు ధర కంటే ఎక్కువకు రూ. 3352కు పెరగడం గమనార్హం. వరికి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ప్రధానంగా పత్తి, కందులు, పెసర, వేరుశనగ, మినుములు, మొక్కజొన్న, సోయాబీన్ పంటలసాగు వ్యయం కూడా అధికంగానే పెరిగింది. గత సంవత్సరం ఎకరా పత్తి సాగు ఖర్చు రూ.29,107 ఉండగా, ఇప్పుడు రూ. 32,020 కి పెరిగింది. ఇక పంటల దిగుబడుల విషయానికోస్తే ఎకరా వరిలో 6 క్విం టాళ్లు, పత్తి 4 క్వింటాళ్లు, సోయాబీన్ 2 క్వింటాళ్ల దిగుబడి తగ్గింది. కందులు, పెసర, మొక్కజొన్నలో స్వల్పంగా పెరిగింది. సంస్థాగత రుణాలు పెరుగుతు న్నా సాగు ఖర్చుకు అనుగుణంగా లభించక పెట్టుబడి బారెడు, దిగుబడి మూరెడు ఎకరా హైదరాబాద్ : రాష్ట్రంలో పంటల సాగు వ్యయం ఏడాదికేడాది పెరుగుతోంది. దీనికి తోడు దిగుబడి పడిపోతోంది. విత్తనాల నుంచి ఎరువులు, పురుగు మందుల ధరలు, కూలీల రేట్లు, ట్రాక్టర్, వరికోత యంత్రాల అద్దె ఇబ్బడి ముబ్బడిగా పెరగగా, వరి, పత్తి, సోయాబీన్ పంటల దిగుబడులు పడిపోయాయి. ఈ ఏడాదికి సంబంధించిన పంటల సాగు వ్యయం వివరాల ను ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌కు సమర్పించింది. వీటిని గత ఏడాది ఇచ్చిన నివేదికతో పోలిస్తే ఈ విషయం బోధపడుతున్నది. గత ఏడాది ఎకరా సాధారణ రకం వరి సాగు ఖర్చు రూ.28,066 కాగా, అది ఈసారి రూ.32,103కు పెరిగింది. అందులో భూమిని చదును చేసేందుకు, దున్నడానికి, విత్తనాలు, ఎరువులతో పాటు కూలీల ఖర్చు అధికంగా ఉంది. కాంప్లెక్స్ ఎరువుల్లో ఎకరా వరికి ఫాస్పరస్ వాడకంతో 2017లో రూ.1287 ఉండగా, 2018లో రెట్టింపు ధర కంటే ఎక్కువకు రూ. 3352కు పెరిగింది. కేవలం వరికి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ప్రధానంగా పత్తి, కందులు, పెసర, వేరుశనగ, మినుములు, మొక్కజొన్న, సోయాబీన్ పంటలసాగు వ్యయం కూడా అధికంగానే పెరిగింది. గత సంవత్సరం ఎకరా పత్తి సాగు ఖర్చు రూ.29,107 ఉండగా, ఇప్పుడు రూ. 32,020 కి పెరిగింది. ఇక పంటల దిగుబడుల విషయానికోస్తే ఎకరా వరిలో 6 క్విం టాళ్లు, పత్తి 4 క్వింటాళ్లు, సోయాబీన్ 2 క్వింటాళ్ల దిగుబడి తగ్గింది. కందులు, పెసర, మొక్కజొన్నలో స్వల్పంగా పెరిగింది. సంస్థాగత రుణాలు పెరుగుతు న్నా సాగు ఖర్చుకు అనుగుణంగా లభించక  పోవడంతో ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడంతో వ్యయం చుక్కలనంటుతోంది. ప్రభుత్వ నివేదికల ప్రకారం 20022014 మధ్య కాలంలో సాంప్రదాయ పంటల సాగు వ్యయం రెట్టింపుగా పెరిగింది. మద్ధతు ధరను గిట్టుబాటు స్థాయిలో పెంచకపోవడం, ప్రభుత్వం నుంచి సక్రమమైన ధర లభించే వరకు పంటను దాచుకునే సహకారం రైతుకు లభించడం లేదు. దీంతో కల్లాలలోనే వ్యాపారులు నిర్ణయించే ధరకు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. పెట్టిన పెట్టుబడి, తన శ్రమ, ఆస్తుల తరుగుదల, భూముల విలువపై వడ్డీని లెక్కిస్తే మిగిలేది నామమాత్రమే. అందుకే ఎగువ, మధ్యస్థాయి రైతులు సాగుకు గుడ్‌బై చెప్పేసి భూమిని కౌలుకు ఇచ్చేసి ఇతరత్రా వ్యాపకాలలోకి దిగుతున్నారని, ప్రభుత్వాలు పంటలకు సరైన మద్ధతు ధర ఇవ్వడంతో పాటు పంట ఉత్పత్తులు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిశోధనల ఫలితాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందేలా చూసి, దిగుబడి పెంచేందుకు సహకరించాలని కోరుతున్నాయి.
Tags: Rising agricultural expenses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *