పెరిగిపోతున్న రైతుల బకాయిలు

విజయవాడముచ్చట్లు:

 

 

ష్ట్రవ్యాప్తంగా రబీ ధాన్యం సేకరణకు సంబంధించి రూ.3,670.90 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సిఉంది. ధాన్యం సేకరణ ప్రారంభంలో 72 గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేస్తామని ప్రకటించినప్పటికీ, ఆ తరువాత 21 రోజులకు పెంచారు. ఆ గడవు ముగిసినా కూడా ఖాతాల్లో డబ్బు జమకాకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,777 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పౌరసరఫరాల సంస్థ రబీ ధాన్యాన్ని సేకరించిన సంగతి తెలిసిందే. ఉన్నఅధికారిక సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 2,44,898మంది రైతుల నుండి 28,35,447 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలసంస్థ సేకరించింది. వీటి విలువ రూ.5,308.28కోట్లు. వీటిలో ఇప్పటి వరకు కేవలం 73,198 మంది రైతులకు, 8,74,479 మెట్రిక్‌ టన్నులకు సంబంధించి రూ.1,637.38కోట్ల రూపాయలను మాత్రమే చెల్లించింది. మిగిలిన రైతులు ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సీజన్‌లో 45లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 28.35లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు.కేంద్ర ప్రభుత్వం నుండి పౌరసరఫరాల సంస్థకు రూ.3,299కోట్లు రావాల్సి ఉంది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశారు. త్వరగా ఆ పెండింగ్‌ డబ్బులు చెల్లించాలని లేఖలో పేర్కొన్నా కేంద్రం నుండి ఇప్పటి వరకు సానుకూల స్పందన లభించలేదు. ఓ వైపు 2021-22 ఖరీఫ్‌ సీజన్‌ పనులు ఊపందుకుంటున్న సమయంలో రబీ పంటలకు సంబంధించి చెల్లింపులు ఇంకా అందకపోవడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్‌ సాగు పనులు ప్రారంభించాలంటే కౌలు డబ్బులు ముందుగానే చెల్లించాలి. రబీ ధాన్యం డబ్బులు వస్తే కౌలు చెల్లించి ఖరీఫ్‌ పనులు సాగుచేద్దామని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం త్వరగా స్పందించి పెండింగ్‌ డబ్బులు ఇస్తే రైతులకు చెల్లింపులు త్వరగా అయిపోతాయని ఆధికారులు వేచిచూస్తున్నారు. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు చెల్లింపులు పూర్తి చేయాలని రైతులు కోరుకుంటున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Rising farmer arrears

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *