దూసుకుపోయిన మార్కెట్లు

Rising markets

Rising markets

– 732 పాయింట్ల అప్
Date:12/10/2018
ముంబై ముచ్చట్లు:
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు దూసుకుపోయాయి. ఐటీ రంగం మినహా ఇతర రంగాల స్టాకులు లాభాలను మూటగట్టుకున్నాయి. అమెరికా డాలరు మారకంతో రూపాయి విలువ బలపడటంతో ఐటీ కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయిశుక్రవారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్ల ప్రభావంతో గురువారం రికార్డు స్థాయిలో నష్టాల బారిన పడిన స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో అదే స్థాయి లాభాలతో పుంజుకున్నాయి. ముడిచమురు ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.
ఉదయం సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభం కాగా.. నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 10,350పైన ట్రేడింగ్‌ ఆరంభించింది. అప్పటి నుంచి ఆసాంతం సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. ఒకదశలో 700 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ 34,800 స్థాయిని అధిగమించింది. సెన్సెక్స్ బాటలోనే నిఫ్టీ కూడా నడిచింది.  ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 732 పాయింట్లు లాభపడి 34,734కు పెరిగింది. నిఫ్టీ 238 పాయింట్లు పెరిగి 10,473కు ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సద్భావ్ ఇంజినీరింగ్ (17.89%), నవకార్ కార్పొరేషన్ (14.10%), జై కార్ప్ (13.47%), ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ (11.58%), టాటా పవర్ (10.43%).
టాప్ లూజర్స్:
గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ (-5.06%), క్వాలిటీ (-4.99%), రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (-4.42%), టీసీఎస్ (-3.10%), జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.93%).
Tags:Rising markets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *