బెంగాల్ లో పోటాపోటీ

Date:19/01/2021

కోల్ కత్తా ముచ్చట్లు:

మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి, ఇక్కడ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మధ్య భీకర యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ తహతహలాడుతుండగా.. మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు మమతా దీదీ ప్రణాళికలు వేస్తున్నారు. పోటాపోటీగా ర్యాలీలు, బహిరంగసభలతో ఎన్నికలకు నాలుగు నెలలకు ముందే పశ్చిమ బెంగాల్‌లో యుద్ధవాతావరణం కనిపిస్తున్నది. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంటుందని సీ ఓటర్‌ సర్వే తేల్చింది. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో ఎవరి గెలుపు ఎలా ఉండబోతున్నది..? అక్కడి ప్రజలు ఎవర్ని కోరుకుంటున్నారు..? ఎవరి పట్ల ఓటర్లు అభిమానం చూపుతున్నారు..? ప్రధాని మోదీ పనితీరు పట్ల ఎంత మేర సంతృప్తితో ఉన్నారు? సీఎంగా మమతా దీదీకి మళ్లీ పట్టం కట్టవచ్చునుకుంటున్నారా..? ఇలాంటి ప్రశ్నలతో సీ ఓటర్‌ సంస్థ సర్వే చేపట్టింది. వారు వెల్లడించిన నివేదిక ప్రకారం సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండి 100 కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుంది. అయితే, అతిపెద్ద పార్టీగా తృణమూల్‌ కాంగ్రెస్‌ నిలిచి మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తుంది.

 

 

అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు ఈసారి 158 సీట్లు రానున్నాయి. అంటే, గత 2016 ఎన్నికల్లో 211 సీట్లు గెలుచుకున్న టీఎంసీ, ఈసారి 53 సీట్లు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, గత ఎన్నికల్లో కేవలం మూడు సీట్లకు పరిమితమైన బీజేపీకి ఈసారి 102 సీట్లు లభించనున్నాయి. అంటే, 99 సీట్లు లబ్ధి పొందుతున్నది. లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ కూటమి కేవలం 30 సీట్లకు మాత్రమే పరిమితం అవనున్నది. స్వతంత్ర అభ్యర్థులు నాలుగు స్థానాల్లో గెలుపొందగలరు.
సీ ఓటర్‌ సర్వే ముఖ్యాంశాలు
బీజేపీ 100 కి పైగా సీట్లను గెలుచుకుంటుంది.
బీజేపీ 37.5 శాతం ఓట్ల వాటాను పొందుతుంది.
తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఈసారి 158 సీట్లు లభిస్తాయి.
37.17 శాతం మంది ప్రధాని మోదీ పని పట్ల సంతృప్తితో ఉన్నారు.
48.8 శాతం మంది మమతా బెనర్జీని మంచి సీఎం అభ్యర్థిగా గుర్తించారు
ఓటు శాతంలో కూడా బీజేపీ ముందు
ఓటు శాతం పరంగా బీజేపీ కంటే టీఎంసీ ముందంజలో ఉంది, అయితే ఈసారి బీజేపీ ఓటు వాటా బాగా పెరిగింది. గత ఎన్నికల్లో కేవలం 10.2 శాతం ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ.. ఈసారి 37.5 శాతం ఓట్లు సాధించింది. కాగా, 2016 లో టీఎంసీ ఓట్ల శాతం 44.9 శాతంగా ఉండగా.. ఈసారి ఎన్నికల్లో అది 43 శాతానికి తగ్గవచ్చు. అదే సమయంలో, లెఫ్ట్ ఫ్రంట్-కాంగ్రెస్ యొక్క ఓటు శాతం 32 శాతం నుంచి 11.8 శాతానికి తగ్గవచ్చు.

 

మోదీ పట్ల సంతృప్తి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు పట్ల చాలా మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. 37.17 శాతం మంది ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని చెప్పగా.. 36.81 శాతం మంది కొంత సంతృప్తి ఉన్నామన్నారు. 23.89 శాతం మంది ప్రజలు ఏమాత్రం సంతృప్తి చెందలేదని పేర్కొన్నారు. 2.14 శాతం మంది ప్రజలు ఏమీ చెప్పలేమన్నారు.
సీఎంగా మమతనే ఉండాలి..
పశ్చిమ బెంగాల్‌ ప్రజలు మమతా బెనర్జీని అత్యుత్తమ ముఖ్యమంత్రిగా గుర్తించారు. ఈ సర్వే ప్రకారం.. 48.8 శాతం మంది మమతా బెనర్జీని మంచి సీఎం అభ్యర్థిగా పేర్కొనగా.. బీజేపీకి చెందిన దిలీప్ ఘోష్‌ను 18.7 మంది ఇష్టపడ్డారు. సీఎం అభ్యర్థిగా క్రికెటర్ సౌరవ్ గంగూలీకి 13.4 శాతం, బీజేపీకి చెందిన ముకుల్ రాయ్ 6.9 శాతం ఓట్లు వచ్చాయి.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags: Rivalry in Bengal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *