లక్ష్మీ పార్వతికి ఆర్జీవీ షాక్

RJ Shock for Lakshmi Parvati

RJ Shock for Lakshmi Parvati

Date:27/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘యన్.టి.ఆర్.’ మూవీకి పోటీగా వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి లక్ష్మీ పార్వతి అతిథిగా కూడా పాల్గొన్నారు. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ జీవితంలోని చీకట కోణాలను చూపించనున్నానని ఆర్జీవీ ప్రకటించారు. ఈ సినిమా తీసేందుకు ఆర్జీవీ.. లక్ష్మీ పార్వతి నుంచి అనుమతి తీసుకోవడమే కాకుండా, మొత్తం స్క్రిప్ట్‌ను ఆమెకు చదివి వినిపిస్తానని మాట ఇచ్చారు కూడా. అయితే, ఇంతలోనే మనసు మార్చకున్న ఆర్జీవీ.. ఆ స్క్రిప్ట్‌ను ఎవరికీ వినిపించాల్సిన అవసరం లేదంటూ లక్ష్మీ పార్వతికి షాకిచ్చారు. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘‘నేను ఎవరికీ స్క్రిప్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే, ఈ సినిమా తీయడం కోసం నేను ఎవరినీ ఒప్పించాల్సిన అవసరం కూడా నాకు లేదు’’ అని అన్నారు. లక్ష్మీ పార్వతి తనపై నమ్మకం ఉంచాలని అన్నారు. తన ‘ఎన్టీఆర్’ సినిమాలో స్టార్‌లు ఉండరని, అంతా కొత్త ముఖాలు ఉంటాయన్నారు. మరి, ఆర్జీవీ మాటలు లక్ష్మీ పార్వతి చెవిలో పడ్డాయో లేదు.
Tags:RJ Shock for Lakshmi Parvati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *