చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

Date:21/05/2020

నల్గోండ ముచ్చట్లు:

రోడ్డు ప్రమాదంలో దంపతులతోపాటు మరో మహిళ మృతి చెందిన ఘటన గురువారం ఉదయం నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి శివారులో చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన గిరిశాల శ్రీనివాస్ (45) కుటుంబసభ్యులతో కలిసి కారులో హైదరాబాద్  బయలుదేరారు.  వీరు ప్రయాణిస్తున్న కారు చిట్యాల మండలం  వట్టిమర్తి శివారులో జాతీయ రహదారి పక్కన ధాన్యం లోడుతో ఆగి ఉన్న లారీని   వెనుక నుంచి ఢీకొట్టింది.  ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్ తో పాటు ఆయన భార్య లక్ష్మీ(30)తోపాటు మరో లక్ష్మీచందన(28) అక్కడిక్కడే దుర్మరణం చెందారు.  ప్రమాదం జరిగిన సమయంలో ముగ్గురు పిల్లలు సహా కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి  తరలించారు.

విశాఖలో రోడ్డెక్కిన బస్సులు

Tags; Road accident at Chittaya: Three killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *