-రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
-సహాయక చర్యల్లో మండలి వెంకట్రామ్
అవనిగడ్డ ముచ్చట్లు:
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి ఎస్-విహార్ వద్ధ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. అటుగా వెళుతూ ప్రమాదాన్ని గమనించిన అవనిగడ్డ నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ సహాయక చర్యలు పర్యవేక్షించారు. ప్రమాదంలో చల్లపల్లికి చెందిన టీ.నరసింహారావు అనే వృద్ధునికి తలకు గాయమైంది. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు యువకుల్లో సోనూ గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రులను మోపిదేవి 108 అంబులెన్సు ఈఎంటీ సీహెచ్ వెంకట నరసయ్య, పైలట్ దిలీప్ ప్రాధమిక చికిత్స అందించి చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Tags; Road accident on national highway