Natyam ad

కానిస్టేబుల్ కు రోడ్డు ప్రమాదం 

రాయచోటి ముచ్చట్లు:

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచిన కానిస్టేబుల్.రాయచోటి పట్టణ పోలీస్ స్టేషన్ లో విషాద ఛాయలు.రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించే 2011 బ్యాచ్ కానిస్టేబుల్ 2511 మల్లిఖార్జునకు, రాయచోటి ఎంజీ గార్డెన్ దగ్గర గురువారం రాత్రి ఎదురెదురుగా రెండు స్కూటర్లు ఢీ కొనడంతో తీవ్రగాయాలయ్యాయి.హుటాహుటిన రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రికి తరలించిన రాయచోటి అర్బన్ ఇన్స్పెక్టర్ శ్రీ సుధాకర్ రెడ్డి.తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచిన కానిస్టేబుల్ మల్లిఖార్జున.మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇతని స్వగ్రామం గాలివీడు మండలంలోని అరవీడు పంచాయతీలోని ఎల్లంపల్లి.రాయచోటి పట్టణ పోలీస్ స్టేషన్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

Post Midle

Tags:Road accident to Constable

Post Midle