కంచికచర్లలో రోడ్డు ప్రమాదం…ఇద్దరు డ్రైవర్లకు గాయాలు

Date:13/07/2019

నందిగామ ముచ్చట్లు:

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల ఊరి శివారు జాతీయ రహదారిపై రెండు లారీలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లు  కర్రీ నరసింహారావు,   కాసరగడ్డ గోపి లు తీవ్రంగా గాయపడ్డారు. లారీలు ఒకదానినొకటి ఢీకొని ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా డ్రైవర్లు ఇద్దరు ఇరుక్కు పోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు కంచికచర్ల ఎస్ ఐ శ్రీ హరి బాబు,   సిబ్బంది దాదాపు రెండు గంటల పైన తీవ్రంగా శ్రమించి ఇరువురిని కాపాడారు. ఇద్దరిని ని ఆంబులెన్స్ లో విజయవాడ తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు .వెలుతురు లేమి, ముందు వెళ్తున్న
వాహనాన్ని ఓవర్ టేక్ చేసిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

 

Tags: Road accidents in the suburbs… Two drivers injured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *