పుంగనూరు ఇందిరాసర్కిల్ నుంచి ఆర్టీసి బస్టాండుకు రోడ్డు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ఎంబిటి రోడ్డులో గల ఇందిరా సర్కిల్ నుంచి వెంకటేశ్వర థి యెటర్ రోడ్డు, గోకుల్ సర్కిల్ వరకు ట్రాఫిక్ తీవ్రమైనందున నూతన రోడ్డు ఏర్పాటుకు అత్యవసర సమావేశం మంగళవారం ఏర్పాటు చేసినట్లు చైర్మన్ అలీమ్బాషా తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఇందిరా సర్కిల్ నుంచి ఆర్టీసి బస్టాండు రోడ్డు ఏర్పాటు చేసేందుకు గతంలో ఈ పనులను ఆర్ అండ్బికి అప్పగించామని, దీనిని మున్సిపాలిటి స్వాధీనం చేసుకుని రోడ్డు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే వ్యాపారుల కోసం కోటిరూపాయలతో కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. వీటిపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సభ్యులు , అధికారులు హాజరుకావాలెనని కోరారు.

Tags: Road from Punganur Indira Circle to RTC Bus Stand
