Natyam ad

రోడ్డు సమస్యలు సీఎం జగనన్న దృష్టికి..

– చిన్న పాండూరు, పూడి రోడ్డు వేయాలని సీఎం జగనన్నకు ఎమ్మెల్యే విజ్ఞప్తి

– సమస్య తీవ్రతను సీఎం కు వివరించిన మంత్రి పెద్దిరెడ్డి

 

సత్యవేడు ముచ్చట్లు:

Post Midle

సత్యవేడు నియోజకవర్గంలో పరిష్కారం కాని రెండు రోడ్డు సమస్యలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. సోమవారం నగరి పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఈ మేరకు ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించారు.సత్యవేడు నియోజకవర్గంలో తీరని సమస్యగా నాగలాపురం-చిన్న పాండూరు, కేవీబీ పురం మండలంలోని పూడి రోడ్డు నిర్మాణం ఉందని వివరించారు.ఈ రోడ్డు పూర్తి కాకపోవడం వల్ల ఆ ప్రాంతాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. సీఎం జగనన్నకు వివరించారు.సమస్య తీవ్రతను పక్కనే ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం ముఖ్యమంత్రికి వివరించారు.స్పందించిన సీఎం జగనన్న అక్కడే ఉన్న తన సంయుక్త కార్యదర్శి భరత్ గుప్తాకు వినతిపత్రం ఇచ్చి పనులు పూర్తైయ్యేలా చూడాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

 

Tags: Road problems brought to the attention of CM Jaganna..

Post Midle