Natyam ad

సర్పంచ్ సొంతఖర్చులో రహదారి మరమత్తులు

ఏలూరు ముచ్చట్లు:

ఏలూరు నుండి బాధరాల మీదగా రంగాపురం వెళ్లే ప్రధాన రహదారి రామసింగవరం దాటి బాధరాల పంచాయతి బోర్డర్ లో రహదారి పూర్తిగా గోతులు మయమై నడవడానికి, వాహనాలు వెళ్లే పరిస్తితికూడా లేనివిధం గా తయారైంది. బాధరాల పంచాయతీ  ఆదాయ వనరులు లేని పంచాయతీ. దీంతో ఆ రహదారుల శాఖ చేపడుతుందని ఎన్నో ఏళ్లుగా చూసినా ఎదురు చూపు ఎండమావిగా మారింది. బాధరాల త సర్పంచ్ బొల్లినేని శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ తా తా కోటేశ్వరరావు ప్రయాణికుల అవస్థలు,విమర్శలు పై స్పందించారు.  మంగళ వారం ఉదయం సర్పంచ్ స్వంత వ్యయంతో జె సి బి ని రప్పించి దీర్ఘ కాలంగా గోతులుగా మారి చెరువుగా తయారైన రహదారి డి మరమ్మత్తులు చేయించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ రహదారి అభివృద్ధికి నిధులు కేటాయించి రహదారి నిర్మాణం చేపట్టాలని బాధరాల ప్రజలు కోరుతున్నారు.

 

Tags: Road repairs at Sarpanch’s own expense

Post Midle
Post Midle