వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత జాగ్రత్తలు తీసుకోవాలి

– రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్

Date:27/01/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు భద్రత వారోత్సవాలు సోమవారం 27వ  తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా సోమవారం వారోత్సవాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ వారోత్సవాలను ప్రారంభించారు. అరవింద సమేత ఫేమ్ ఈషా రెబ్బ పాల్గొన్నారు. మంత్రి పువ్వాడ హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ ను నడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో వాహనాలు, జనాభా సంఖ్య పెరగడంతో విపరీతంగా రోడ్డు యాక్సిడెంట్ లు పెరిగిపోతున్నాయన్నారు. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ద్విచక్ర వాహన నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెంట్ను ధరించాలన్నారు. కారు తదితర భారీ వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్టులు పెట్టుకొని నడపాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే నడిపేవారితో పాటు ఎదుటివారికి సైతం ప్రమాదాలు సంభవిస్తాయన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ప్రయాణాల్లో అందరికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా వ్యవహరించాలని సూచించారు.

రైతులకు విరివిగా డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకం

Tags: Road safety precautions should be taken when driving vehicles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *